breaking news
FM stations
-
సాంకేతిక ప్రజాస్వామ్యం దిశగా
న్యూఢిల్లీ: ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్(ఎఫ్ఎం) రేడియో సేవలను గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించే దిశగా 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రేడియో పరిశ్రమలో ఇదొక విప్లవాత్మకమైన ముందుడుగు అని అభివర్ణించారు. సాంకేతిక(టెక్నాలజీ) ప్రజాస్వామీకరణ కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. తమ తరానికి రేడియోతో భావోద్వేగ అనుబంధం ఉందని తెలిపారు. తాను రేడియో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నానంటూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రస్తావించారు. 100వ ఎపిసోడ్ వచ్చే ఆదివారం ప్రసారం కాబోతోందని వివరించారు. దేశ ప్రజలతో భావోద్వేగపూరిత బంధం పెంచుకోవడం రేడియో ద్వారానే సాధ్యమని ఉద్ఘాటించారు. అందరికీ ఆధునిక టెక్నాలజీ స్వచ్ఛ భారత్ అభియాన్, బేటీ బచావో, బేటీ పడావో, హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలు మన్ కీ బాత్ ద్వారా ప్రజా ఉద్యమాలుగా మారాయని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆలిండియా రేడియో బృందంలో తాను కూడా ఒక భాగమేనని వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, అందులో భాగంగానే 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రారంభించామని తెలియజేశారు. దేశం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి ఆధునిక టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావడం కీలకమన్నారు. డిజిటల్ ఇండియా వల్ల రేడియో శ్రోతల సంఖ్య పెరగడమే కాదు, కొత్త ఆలోచనా విధానం ఉద్భవిస్తోందని వివరించారు. ప్రతి ప్రసార మాధ్యమంలో విప్లవం కనిపిస్తోందని చెప్పారు. డీడీ ఉచిత డిష్ సేవలను 4.30 కోట్ల ఇళ్లకు అందించినట్లు తెలిపారు. ప్రపంచ సమాచారం ఎప్పటికప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు, దేశ సరిహద్దుల్లోని కుటుంబాలకు చేరుతోందని హర్షం వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు సైతం విద్యా, వినోద సమాచారం చేరుతోందన్నారు. డిజిటల్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు గ్రామీణ ప్రాంతాలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణతో మొబైల్ డేటా చార్జీలు భారీగా తగ్గిపోయాయని, సమాచారం పొందడం ప్రజలకు సులభతరంగా మారిందని అన్నారు. దేశం నలుమూలలా డిజిటల్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పుట్టుకొ స్తున్నారని వెల్లడించారు. చిరువ్యాపారులు కూడా యూపీఐ సేవలు బ్యాంకింగ్ సదుపాయాలు వాడుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి ప్రారంభించిన 91 ఎఫ్ఎం ట్రాన్స్‌మిట్టర్ల ద్వారా దేశవ్యాప్తంగా 85 జిల్లాల్లో రెండు కోట్ల మందికి పైగా ప్రజలు ఎఫ్ఎం రేడియో ప్రసారాలు వినవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయా, నాగాలాండ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, చత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు మారుమూల జిల్లాలతోపాటు లద్దాఖ్, అండమాన్, నికోబార్ దీవుల్లో ఎఫ్ఎం రేడియో సేవలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. రికమండేషన్లకు చరమగీతం ఆలిండియా రేడియో వంటి కమ్యూనికేషన్ చానళ్లు మొత్తం దేశాన్ని, దేశంలోని 140 కోట్ల మందిని అనుసంధానించాలన్నదే తమ విజన్, మిషన్ అని ప్రధాని మోదీ వివరించారు. గతంలో రికమండేషన్ల ఆధారంగా పద్మా పురస్కారాలు ప్రదానం చేసేవారని, ఆ పద్ధతికి తాము చరమగీతం పాడేశామని అన్నారు. దేశానికి, సమాజానికి అందించిన విలువైన సేవల ఆధారంగానే ఈ పురస్కారాలు అందజేస్తున్నామని చెప్పారు. ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ప్రారంభోత్సవంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పలువురు పద్మ పురస్కార గ్రహీతలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ వారికి స్వాగతం పలికారు. -
కశ్మీర్లో హింసకు రహస్య కోడ్
న్యూఢిల్లీ: కశ్మీర్లో అలజడి సృష్టించేందుకు పాక్ సైన్యం, ఉగ్రసంస్థల అధినేతలు తమ అనుచరులకు కోడ్ భాషలో రహస్య సందేశాలను పంపుతున్నట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. ఇందుకోసం పలు ఎఫ్ఎం ట్రాన్స్మిషన్ స్టేషన్లను ఎల్వోసీ సమీపానికి పాకిస్తాన్ తరలించించినట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కశ్మీర్లో దాడులు చేయాలంటూ ఈ కేంద్రాల ద్వారా స్థానిక ఉగ్రవాదులకు సందేశాలు పంపిస్తున్నారని వెల్లడించారు. సంప్రదింపుల కోసం ఉగ్రసంస్థలు జైషే మొహమ్మద్(68/69), లష్కరే తోయిబా(ఏ3), అల్ బద్ర్(డీ9) సంకేతాలను వాడుతున్నాయని చెప్పారు. సైన్యం, ఉగ్రసంస్థలు పాకిస్తాన్ జాతీయ గీతమైన ‘క్వామీ తరానా’ ద్వారా సందేశాలు పంపుతున్నాయని నిఘావర్గాలు గుర్తించాయి. కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా, స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని గత నెల 5న రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన వారం రోజుల్లోనే ఎల్వోసీ వెంట ఈ తరహా సందేశాలు పెరిగిపోయాయి. ఇందుకోసం దాయాది దేశం ఎల్వోసీతో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో వెరీ హైఫ్రీక్వెన్సీ రేడియో స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు నిఘా సంస్థలు తెలిపాయి. -
రాజాకు కోపం వచ్చింది...
చెన్నై: ఇళయరాజా స్వరపర్చిన పాటలను ప్రసారం చేయాలంటే ఇక ఎఫ్ ఎం రేడియోస్టేషన్లు, టీవీలు ఇక ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఇళయరాజా తాజా ప్రకటన చూస్తే ఇక వాళ్లు వేరే దారి వెతుక్కోవాల్సిందే అనిపిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు, ఇసైజ్ఞాని ఇళయరాజాకు కోపం వచ్చింది. నేను స్వరపర్చిన పాటలన్నింటి పైనా హక్కులు నావే.. కావాలంటే రైట్స్ కొనుక్కోండంటూ.. వివిధ ఎఫ్ఎం రేడియోస్టేషన్లు, టీవీలపై కొరడా ఝళిపించారు. తన అనుమతి లేకుండా తను కంపోజ్ చేసిన వేలాది పాటలను ఎలా వాడుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకముందు తన పాటలను వాడుకోవాలనుకునే వారెవరైనా తననుంచి గానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి గానీ అనుమతి తీసుకోవాలని తెగేసి చెబుతున్నారు. తన అనుమతి లేనిదే తన పాటలు ప్రసారం చేయడం చట్టవిరుద్దమంటున్నారు. అంతేకాదు ఇలా వచ్చిన మొత్తంలో కొంతభాగాన్ని నిర్మాతలకు పంచి ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నానని చెప్పుకొచ్చారు. అలాగే మేధో సంపత్తి హక్కు మీద మళ్ళీ తీవ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందంటున్నారు. నేను దుక్కిదున్ని సాగుచేశాను... నా పంటను అమ్ముకున్నాను నిజమే.. అంతమాత్రాన నేను నాటిన చెట్టును కూడా తీసుకుంటానంటే ఎలా అంటూ వాదిస్తున్నారు.