జమ్మూ సరిహద్దులో పాక్ కాల్పులు | Pak violates ceasefire along LoC | Sakshi
Sakshi News home page

జమ్మూ సరిహద్దులో పాక్ కాల్పులు

Apr 25 2014 12:54 PM | Updated on Mar 23 2019 8:33 PM

జమ్మూ-పాకిస్తాన్ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ మరో సారి కవ్వింపు చర్యలకు పాల్పడింది.

జమ్మూ-పాకిస్తాన్ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ మరో సారి కవ్వింపు చర్యలకు పాల్పడింది.  ఉదయం 9.15 గంటల ప్రాంతంలో పాక్ సేనలు పూంఛ్ సెక్టర్ లోని షాహ్ పూర్ వద్ద మోహరించిన ఉన్న భారత సైనికులపై కాల్పులు జరిపాయి. దీనికి భారత జవాన్లు దీటైన జవాబిచ్చారు. ఇప్పటికీ కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.

ఉగ్రవాదులను భారత్ లోకి జొప్పించేందుకు, జవాన్ల దృష్టిని మళ్లించేందుకు పాకిస్తాన్ ఈ కాల్పులకు పాల్పడిందని భద్రతాధికారులు చెబుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement