జైలు నుంచి పాక్‌ అక్కాచెల్లెళ్ల విడుదల | Pak Sisters Releases From Jail | Sakshi
Sakshi News home page

అమృత్‌సర్‌ జైలు నుంచి పాక్‌ అక్కాచెల్లెళ్ల విడుదల

Nov 2 2017 9:58 PM | Updated on Nov 2 2017 11:27 PM

Pak Sisters Releases From Jail - Sakshi

అమృత్‌సర్‌: మాదక ద్రవ్యాల కేసులో కటకటాలపాలైన పాకిస్థాన్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు ఫాతిమా, ముంతాజ్‌లు గురువారం విడుదలయ్యారు. వారితోపాటు 11 ఏళ్ల హీనాకు కూడా మోక్షం లభించింది. శిక్షాకాలంలో ఫాతిమాకు హీనా జన్మిచింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుపై భారత ప్రధాని నరేంద్రమోదీప్రత్యేకశ్రద్ధ తీసుకున్నారని తమకు తెలిసిందని, అందువల్ల ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారతమాతకు వందనం చేస్తున్నాం’ అని విడుదల అనంతరం ఫాతిమా ఉద్వేగంగా తెలియజేసింది. తమ దేశానికి వెళ్లే ముందు స్వర్ణదేవాలయాన్ని సందర్శించాలని అభిలషిస్తున్నట్టు చెప్పారు. కాగా పాకిస్థాన్‌లో మాదకద్రవ్యాలు తీసుకుని భారత్‌లో చొరబడేందుకు యత్నిస్తుండగా 2006, మే ఎనిమిదో తేదీన అట్టారి అంతర్జాతీయ సరిహద్దు వద్ద భద్రతా బలగాలు అరెస్టు చేయడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement