'ఒప్పో' ఫ్యాక్ట‌రీలో క‌రోనా క‌ల‌క‌లం

Oppo Shuts Down Factory After Six Employees Tested Corona - Sakshi

ఢిల్లీ :  ప్ర‌ముఖ చైనీస్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ 'ఒప్పో' ఫ్యాక్ట‌రీలో క‌రోనా క‌ల‌కలం సృష్టిస్తుంది. నోయిడాలోని ఒప్పో ఫ్యాక్ట‌రీలో ప‌నిచేస్తున్న 6మంది ఉద్యోగుల‌కు కోవిడ్ పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది. దీంతో త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు ఫ్యాక్ట‌రీకి ఎవ‌రూ రావద్ద‌ని ఒప్పో ఇండియా కంపెనీ ప్ర‌తినిధి  ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. అధికారిక స‌మాచారం ప్ర‌కారం..గ్రేట‌ర్ నోయిడాలోని ఒప్పో త‌యారీ సంస్థ‌లో మొత్తం 3వేల మంది కార్మికులు ఉన్నారు. వీరిలో ఆరుగురికి క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. దీంతో మిగ‌తా ఉద్యోగుల  భ‌ద్ర‌త దృష్ట్యా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా సంస్థ‌ను మూసివేస్తున్న‌ట్లు  ఒప్పో ఇండియా ప్ర‌తినిధి వెల్ల‌డించారు.  (కువైట్ నుంచి వ‌చ్చిన భార‌తీయుల్లో క‌రోనా )

ప్ర‌స్తుతం మిగ‌తా ఉద్యోగులంద‌రికీ స్ర్కీనింగ్  నిర్వ‌హిస్తున్నారు. వీరి ప‌రీక్షా ఫ‌లితాలు వెలువడాల్సి ఉంది.  దీంతో అప్ప‌టివ‌ర‌కు ఉద్యోగులెవ‌రూ ఫ్యాక్టరీకి రావ‌ద్ద‌ని, త‌దుప‌రి నోటీసులు వ‌చ్చాకే కార్య‌క‌లాపాలు మొదలుపెట్టాల‌ని సంస్థ యాజ‌మాన్యం ఆదేశించింది. కేవలం క‌రోనా నెగిటివ్ వ‌చ్చిన వారు మాత్ర‌మే ఫ్యాక్ట‌రీకి రావ‌ల్సిందిగా అధికారులు తెలిపారు. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల ప్ర‌కారం ఈనెల ప్రారంభంలో ఒప్పో ఫ్యాక్ట‌రీలో య‌థావిధిగా కార్య‌క‌లాపాలు ప్రారంభించారు. దీంతో 30 శాతం మంది ఉద్యోగుల‌తో కంపెనీని తిరిగి ప్రారంభించారు. ఢిల్లీలో 24 గంటల్లోనే 299 క‌రోనా కేసులు న‌మోదుకాగా, దేశ వ్యాప్తంగా కొత్త‌గా 5వేల కోవిడ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్‌లో వెలుగుచూసిన క‌రోనా కేసుల సంఖ్య 96,169 కు చేరుకుంది. 
( భారత్‌లో ఒకే రోజు 5,242 పాజిటివ్‌ కేసులు )

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top