అతడు మాత్రమే ప్రపంచాన్ని కాపాడగలడు! | Only donald trump can save humanity: Hindu Sena | Sakshi
Sakshi News home page

అతడు మాత్రమే ప్రపంచాన్ని కాపాడగలడు!

May 11 2016 6:17 PM | Updated on Aug 25 2018 7:50 PM

అతడు మాత్రమే ప్రపంచాన్ని కాపాడగలడు! - Sakshi

అతడు మాత్రమే ప్రపంచాన్ని కాపాడగలడు!

డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని కాంక్షిస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద బుధవారం హోమం నిర్వహించారు.

న్యూఢిల్లీ: డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని కాంక్షిస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద బుధవారం హోమం నిర్వహించారు. మంత్రాలు జపిస్తూ ట్రంప్కు విజయం చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు హిందూ సేన కార్యకర్తలు. ఇటీవలి ప్రైమరీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి రిపబ్లికన్ పార్టీ తరపున నవంబర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవడానికి దూసుకుపోతున్న ట్రంప్ మాత్రమే ప్రపంచాన్ని కాపాడగలడని, ఆయన విజయం సాధించాలని ఈ సందర్భంగా హిదూసేన కార్యకర్తలు వేడుకున్నారు.

ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి ప్రజలను కాపాడేందుకు ఉన్నటువంటి ఒకే ఒక ఆశ 'డొనాల్డ్ ట్రంప్' అని ఈ సందర్భంగా హిందూ సేన కార్యకర్తలు వెల్లడించారు. 'వి లవ్ ట్రంప్', 'వి సపోర్ట్ ట్రంప్' అని రాసివున్న ట్రంప్ ఫొటోలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్యారిస్ దాడుల నేపథ్యంలో అమెరికాలోకి ముస్లింలను రానివ్వకుండా బ్యాన్ చేయాలని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement