పెరిగిన అసోం వరదల మృతులు | One more death reported in Assam floods | Sakshi
Sakshi News home page

పెరిగిన అసోం వరదల మృతులు

Jun 25 2020 4:07 PM | Updated on Jun 25 2020 4:07 PM

One more death reported in Assam floods - Sakshi

గువాహటి: అసోంలోని ఐదు జిల్లాల్లో వరదల ప్రభావం ఇంకా తగ్గలేదు. తాజాగా గురువారం మరొకరు వరదల ధాటికి మరణించినట్లు అసోం డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ వెల్లడించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12కు చేరింది. దీహాజీ, జోర్హాట్‌, శివసాగర్‌, దిబ్రూఘడ్‌, మజౌలి జిల్లాల్లో 38 వేల మంది ప్రభావితమయ్యారు. (మ్యాన్‌హోల్‌ శుభ్రం చేసిన కార్పొరేటర్‌)

కొద్దిరోజులుగా వర్షాల కారణంగా 102 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. 5,031 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు చేర్చినట్లు అధికారులు పేర్కొన్నారు. (కరోనా కొత్త హాట్ స్పాట్ ఢిల్లీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement