
మళ్లీ లీకయిందోచ్..
కర్ణాటకలో వరుసగా పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నాయి. పదిరోజుల్లో రెండోసారి ఇంటర్ కెమిస్ట్రీ పేపర్ లీక్ అయింది.
బెంగళూరు: కర్ణాటకలో వరుసగా పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నాయి. పదిరోజుల్లో రెండోసారి ఇంటర్ కెమిస్ట్రీ పేపర్ లీక్ అయింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో పడ్డారు. పేపర్ లీకవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు నిరసనకు దిగారు.
బెంగళూరులోని పీయూసీ భవనంపై రాళ్ల దాడి చేశారు. దీంతో అక్కడే మోహరించిన పోలీసులు విద్యార్థులను అరెస్టు చేశారు. కాగా, పేపర్ లీకేజీకి బాధ్యత వహించి విద్యాశాఖమంత్రి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.