మరోసారి వీచిన మోదీ గాలి | Once again blowed modi wind | Sakshi
Sakshi News home page

మరోసారి వీచిన మోదీ గాలి

Oct 19 2014 9:25 AM | Updated on Mar 29 2019 9:24 PM

నరేంద్ర మోదీ - Sakshi

నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ గాలి మరోసారి వీచింది.

 ప్రధాని నరేంద్ర మోదీ గాలి మరోసారి వీచింది. మహారాష్ట్ర, హర్యానా రెండు రాష్ట్రాలలో బీజేపీ దూసుకుపోతోంది. ఓట్ల లెక్కింపులో ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్కు ఘోర పరాజయం మిగలనుంది. రెండు చోట్ల ఆ పార్టీ అధికారం కోల్పోనుంది. మహారాష్ట్రలో  288 స్థానాలకు, హర్యానాలో 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో అధికారంలోకి రావడానికి 145 స్థానాలు,  హర్యానాలో 46 స్థానాలు కావాలి.  

ఎవరి మద్దతు లేకుండా బిజెపి రెండు రాష్ట్రాలలో స్వతంత్రంగా అధికారాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. హర్యానాలో మాత్రం స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది. మహారాష్ట్రలో కొద్దిసేపటి తరువాత మాత్రమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోతే పొత్తు అనివార్యం అవుతుంది. శివసేనతో పొత్తు పెట్టుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే వీరిద్దరూ పాత స్నేహితులే అయినందున పొత్తుకు ఇబ్బందులు ఏమీ తలెత్తే అవకాశం లేదు.

ఈ రెండు రాష్ట్రాలలో  తొలిసారిగా  బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి. మహారాష్ట్రలో మిత్రపక్షాల సహకారం తీసుకున్నా, ఎక్కువ స్థానాలు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉన్నందున, ఆ పార్టీ నేతే ముఖ్యమంత్రి అవుతారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement