జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో అధికార నేషనల్ కాంగ్రెస్ చతికిలపడింది. ఏకంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వెనుకంజలో ఉన్నారు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో అధికార నేషనల్ కాంగ్రెస్ చతికిలపడింది. ఏకంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వెనుకంజలో ఉన్నారు. సోనావార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఒమర్ వెనుకబడి ఉన్నారు.
కాగా ఒమర్ రెండు చోట్ల పోటీ చేశారు. బీర్వా నియోజకవర్గంలో మాత్రం ఒమర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో పీడీపీ, బీజేపీ పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. పీడీపీ ముందంజలో ఉండగా, బీజేపీ రెండో స్థానంలో ఉంది.