
ఓడి గెలిచిన కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అతికష్టమ్మీద పరువు దక్కించుకున్నారు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అతికష్టమ్మీద పరువు దక్కించుకున్నారు. సోనావార్, బీర్వా నియోజకవర్గాల నుంచి బరిలో దిగిన ఒమర్ రెండు చోట్లా ఓడిపోయినట్టు వార్తలు వచ్చాయి.
సోనావార్లో పరాజయంపాలైనట్టు అధికారులు ప్రకటించారు. బీర్వాలోనూ ఓడినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఒమర్ అతిస్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఒమర్ వెయ్యి ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాగా ఆయన సారథ్యంలోని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ చిత్తుగా ఓడిపోయింది.