రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ‘బతుకమ్మ’కు నో! | No to the Republic Day Parade | Sakshi
Sakshi News home page

రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ‘బతుకమ్మ’కు నో!

Dec 20 2016 3:29 AM | Updated on Sep 4 2017 11:07 PM

రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ‘బతుకమ్మ’కు నో!

రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ‘బతుకమ్మ’కు నో!

రిపబ్లిక్‌ డే సందర్భంగా ఢిల్లీలో నిర్వహించే పరేడ్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘బతుకమ్మ’ శకటాన్ని కేంద్ర రక్షణ శాఖ తిరస్కరించినట్లు సమాచారం.

తెలంగాణ శకటాన్ని తిరస్కరించిన కేంద్ర రక్షణ శాఖ

సాక్షి, న్యూఢిల్లీ: రిపబ్లిక్‌ డే సందర్భంగా ఢిల్లీలో నిర్వహించే పరేడ్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘బతుకమ్మ’ శకటాన్ని కేంద్ర రక్షణ శాఖ తిరస్కరించినట్లు సమాచారం. గత రిపబ్లిక్‌ డే పరేడ్‌లో తెలంగాణ శకటానికి అవకాశం లభించని విషయం తెలిసిందే.

ఈ సారి కేంద్ర రక్షణ శాఖ ‘బతుకమ్మ’ శకటాన్ని ప్రాథమికంగా ఆమోదించినా.. తుది ఎంపికలో మాత్రం తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ శకటానికి పరేడ్‌ అవకాశం కల్పించాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు కేంద్రాన్ని కోరనున్నట్లు సమాచారం. కాగా.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ‘బొర్రా గుహల’ నేపథ్యంలోని శకటాన్ని కేంద్ర రక్షణ శాఖ ఇంతకు ముందే ప్రాథమిక దశలోనే తిరస్కరించింది.

Advertisement
 
Advertisement
Advertisement