‘అబ్బాయిలతో తిరగడం ఆపలేదో.. ఇంటికే ఇక’ | NIT Calicut warns girls against 'roaming' with boys at hostels | Sakshi
Sakshi News home page

‘అబ్బాయిలతో తిరగడం ఆపలేదో.. ఇంటికే ఇక’

Nov 24 2016 3:30 PM | Updated on Sep 4 2017 9:01 PM

‘అబ్బాయిలతో తిరగడం ఆపలేదో.. ఇంటికే ఇక’

‘అబ్బాయిలతో తిరగడం ఆపలేదో.. ఇంటికే ఇక’

తమ క్యాంపస్లోని విద్యార్థినులకు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీ-సీ) కాలికట్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. ఏ అమ్మాయి కూడా అబ్బాయితో తిరుగుతూ కనిపించవొద్దని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

కోజికోడ్‌: తమ క్యాంపస్లోని విద్యార్థినులకు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీ-సీ) కాలికట్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. ఏ అమ్మాయి కూడా అబ్బాయితో తిరుగుతూ కనిపించవొద్దని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు క్యాంపస్‌ లేడీస్‌ హాస్టల్‌ వార్డెన్‌ నోటీసులను అంటించింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్‌ లింగ వివక్షకు గురి చేస్తున్నారంటూ ఆమె చర్యను ఖండించారు.

కొంతమంది ప్రొఫెసర్లు కూడా ఈ నోటీసులు చూసి అవాక్కయ్యారు. ఆ నోటీసులో ఎస్‌ భువనేశ్వరీ అనే వార్డెన్‌ పేరిట చెప్పారంటే.. ’క్యాంపస్‌ లోని రెండు వసతి గృహాల ప్రాంగణాల్లో అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి తిరుగుతున్నట్లు తెలిసింది. మాకు ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందాయి. ఇక నుంచి ఏ అమ్మాయి అయినా అబ్బాయితో కలిసి ఇక్కడ తిరుగుతున్నట్లు తెలిసిందో వారిపై సస్పెన్షన్‌ వేటుగానీ, హాస్టల్‌ నుంచి వెళ్లగొట్టే చర్యలుగానీ తీసుకోవడం జరుగుతుంది జాగ్రత్త’ అంటూ పేర్కొన్నారు. అయితే, ప్రత్యేకంగా అమ్మాయిలను మాత్రమే ఉద్దేశించి చెప్పడంపై అక్కడి వాళ్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement