బురద్వాన్ పేలుడుపై ఎన్ఐఏ చీఫ్ పర్యవేక్షణ | NIA chief Sharad Kumar monitors probe into Burdwan blast Kolkata | Sakshi
Sakshi News home page

బురద్వాన్ పేలుడుపై ఎన్ఐఏ చీఫ్ పర్యవేక్షణ

Oct 24 2014 12:42 PM | Updated on Oct 17 2018 5:14 PM

బురద్వాన్ పేలుడు కేసు విచారణను ఎన్ఐఏ చీఫ్ శరద్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

కోల్కతా : బురద్వాన్ పేలుడు కేసు విచారణను ఎన్ఐఏ చీఫ్ శరద్ కుమార్  స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం ఉదయం బురద్వాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా శరద్ కుమార్ ... పేలుడు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.  పశ్చిమ బెంగాల్‌లోని బురద్వాన్ ఖాగ్రాఘర్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో ఈ నెల 2న భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.

స్థానిక టీఎంసీ నేతలకు చెందిన ఇంట్లో అద్దెకు ఉంటున్న కొందరు భారీ ఎత్తున బాంబుల్ని తయారు చేస్తుండగా వాటిలో కొన్ని పేలిపోయాయి. ఈ ఘటనలో బాంబులు తయారు చేస్తూ మరణించిన వ్యక్తిని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న గ్యాంగ్‌లో ఒకరుగా గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారులు.. హఫీజ్ మొల్లా, షేక్ అహ్మద్, హసన్ సాహెబ్‌లతో పాటు మరో ఇద్దరు మహిళలు రజియా బీబీ, అలీమా బీబీలను అక్టోబర్ 13న అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement