ఈసీకి కొత్త అంబాసిడర్లు | New Ambassadors For Election Commision In Karnataka | Sakshi
Sakshi News home page

ఈసీకి కొత్త అంబాసిడర్లు

May 2 2018 1:38 PM | Updated on Aug 14 2018 4:34 PM

New Ambassadors For Election Commision In Karnataka - Sakshi

ఆర్‌బీ వైష్ణవి, రజిని

సాక్షి, బెంగళూరు: రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొత్తగా నలుగురు రాయబారులుగా ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సంజీవ్‌ కుమార్‌ వారి పేర్లను వెల్లడించారు. రాష్ట్రంలోని సామాన్యులకు ఓటు విలువ తెలియజేస్తూ వారు ప్రచారం నిర్వహిస్తారు. టీవీ ప్రముఖ నటి రజిని, ఆర్‌బీ వైష్ణవి, బిగ్‌బాస్‌ విజేత చందన్‌ శెట్టి, ప్రముఖ నటుడు వశిష్ట ఎన్‌.సింహలు కొత్త రాయబారులుగా ఎంపికయ్యారు. 

1) పేరు: వశిష్ట ఎన్‌.సింహ
రంగం: నటుడు, గాయకుడు
సోషల్‌ మీడియాలో రెండు లక్షల మంది ఫాలోవర్లు 
అవార్డ్స్‌: 2017 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు (ఉత్తమ సహాయ నటుడు), ఉత్తమ ప్రతినాయకుడిగా 2017లో ఐఫా అవార్డు 
ప్రొఫైల్‌: కన్నడ సినీరంగంలో పేరు మోసిన నటుడు. మైసూరుకు చెందిన వశిష్ట తొలుత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. సినిమా రంగంలో డబ్బింగ్‌ కళాకారుడు, గాయకుడిగా కూడా సుపరిచితుడు. 

2) పేరు: చందన్‌ శెట్టి
రంగం: గాయకుడు
అవార్డులు: బిగ్‌బాస్‌ కన్నడ సీజన్‌ 5 విన్నర్‌
సోషల్‌ మీడియాలో 8 లక్షల మంది ఫాలోవర్లు
ప్రొఫైల్‌: చందన్‌ శెట్టి కన్నడ ర్యాపర్‌గా చాలా మందికి సుపరిచితం. అతి తక్కువ సమయంలో సంగీతంలో చాలా పేరు సంపాదించారు. యువతలో చందన్‌ పాటలు చాలా ఫేమస్‌. 

3) పేరు: ఆర్‌బీ వైష్ణవి
రంగం: సినీ హీరోయిన్, టీవీ నటి
ఫ్రొఫైల్‌: అతి తక్కువ సమయంలో తన నటన ద్వారా టీవీ ద్వారా చాలా మంది కన్నడిగులకు సురిచితమయ్యారు. 

4) పేరు: రజిని
రంగం: టీవీ నటి
సోషల్‌ మీడియాలో 4 లక్షల ఫాలోవర్లు
ప్రొఫైల్‌: గాయకురాలిగా కెరీర్‌ను ప్రారంభించిన రజిని ఆ తర్వాత టీవీ రంగంలో తన హవాను కొనసాగించింది. ఒక సీరియల్‌లోని క్యారెక్టర్‌ అమృత వర్షిణి పేరు వల్ల అమృతగా చాలా మందికి చిరస్థాయిగా గుర్తుండిపోయారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement