లాయర్‌ను పెళ్లాడనున్న తివారీ కుమారుడు | ND Tiwari Son Rohit Shekhar Got Engaged To Apurva Shukla | Sakshi
Sakshi News home page

లాయర్‌ను పెళ్లాడనున్న తివారీ కుమారుడు

Apr 8 2018 9:06 PM | Updated on Sep 2 2018 5:18 PM

ND Tiwari Son Rohit Shekhar Got Engaged To Apurva Shukla - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌డీ తివారీ కుమారుడు రోహిత్‌ శేఖర్‌ నిశ్చితార్థం శనివారం ఘనంగా జరిగింది. న్యూఢిల్లీలోని రోహిత్‌ నివాసంలో ఇండోర్‌కు చెందిన అపూర్వ శుక్లాతో నిశ్చితార్థం జరిగింది. అపూర్వ సుప్రీం కోర్టులో లాయర్‌గా పని చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రోహిత్‌ కుటుంబ సభ్యులు,స్నేహితులు హాజరయ్యారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి దగ్గరకి తల్లి ఉజ్వల తివారీతో కలసి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు.

దీర్ఘకాల న్యాయ పోరాటం తరువాత రోహిత్‌ను కొడుకుగా తివారీ అంగీకరించారు. 2008లో ఎన్‌డి తివారీ తన తండ్రి అంటూ రోహిత్‌ శేఖర్‌ కోర్టుకెక్కారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు తివారీ-శేఖర్ డీఎన్ఎ రిపోర్టును పరిశీలించి 2012, జులై 27న శేఖర్ తివారీ కొడుకేనని రిపోర్టులు రుజువు చేస్తున్నాయని తేల్చింది. దీంతో తివారీ 2014లో నిజాన్ని ఒప్పేసుకొని ఉజ్వలను పెళ్లి చేసుకున్నారు. 2017 జనవరిలో రోహిత్‌ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement