నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు వెళ్లారు.
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. గత విచారణం సందర్భంగా వారు తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ వారు సుప్రీం మెట్లెక్కారు. గత ఏడాది చివర్లో డిసెంబర్ లో ఈ కేసుకు సంబంధించి వారు తప్పనిసరిగా హాజరుకావాలని ఢిల్లీ హైకోర్టు వారిని ఆదేశించింది.
అయితే, అందుకు తమకు మినహాయింపు ఇవ్వాలని వారు కోరినా కోర్టు తిరస్కరించింది. తమకు కోర్టు హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలని తాజాగా వారు చేసుకున్న పిటిషన్ పై తదుపరి విచారణ ఫిబ్రవరి 20న జరగనుంది. హెరాల్డ్ పత్రిక పేరిట చట్ట వ్యతిరేకంగా వేల కోట్లను అక్రమంగా తమ ఖాతాల్లోకి జమచేసుకోవాలని ప్రయత్నించారని వారిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.