లెజెండరీ ప్లేయర్కు తృటిలో తప్పిన ప్రమాదం | Narrow escape for Brazilian footballer Ronaldinho in Kerala aftr non working traffic signal fell in front of his car | Sakshi
Sakshi News home page

లెజెండరీ ప్లేయర్కు తృటిలో తప్పిన ప్రమాదం

Jan 25 2016 4:30 PM | Updated on Apr 3 2019 7:53 PM

లెజెండరీ ప్లేయర్కు తృటిలో తప్పిన ప్రమాదం - Sakshi

లెజెండరీ ప్లేయర్కు తృటిలో తప్పిన ప్రమాదం

బ్రెజిల్ లెజెండరీ ఫుట్ బాల్ క్రీడాకారుడు రోనాల్డినో తృటిలో ప్రమాదం నుంచి తప్పిందచుకున్నారు. కేరళలో ఆయన కారులో వెళుతుండగా పనిచేయని ఓ ట్రాఫిక్ సిగ్నలింగ్ పోల్ అమాంతం పడిపోయింది.

తిరువనంతపురం: బ్రెజిల్ లెజెండరీ ఫుట్ బాల్ క్రీడాకారుడు రోనాల్డినో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కేరళలో ఆయన కారులో వెళుతుండగా పనిచేయని ఓ ట్రాఫిక్ సిగ్నలింగ్ పోల్ అమాంతం పడిపోయింది. దీంతో కారు డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ చేశారు. లేదంటే అనూహ్య ప్రమాదం జరిగి ఉండేది.

సోమవారం ఉదయం నడక్కావులోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో జరిగిన నాగ్ జీ ఇంటర్నేషనల్ క్లబ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రోనాల్డినో పాల్గొన్నారు. అనంతరం తిరిగి వెళుతుండగా ఒక్కసారిగా పనిచేయని సిగ్నలింగ్ పోల్ పడిపోయింది. రెండు సెకన్లు ఆలస్యంగా అది పడిపోయి ఉంటే ఏకంగా ఆయన కారుపైనే పడేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కేరళ పర్యటనకు రోనాల్డినో ఆదివారం సాయంత్రం వచ్చిన విషయం తెలిసిందే.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement