ఫోన్లలోనూ ప్రమాణస్వీకారం లైవ్! | Narendra Modi swearing-in to be available live on phone | Sakshi
Sakshi News home page

ఫోన్లలోనూ ప్రమాణస్వీకారం లైవ్!

May 26 2014 3:01 PM | Updated on Aug 15 2018 2:14 PM

ఫోన్లలోనూ ప్రమాణస్వీకారం లైవ్! - Sakshi

ఫోన్లలోనూ ప్రమాణస్వీకారం లైవ్!

మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమం మొత్తాన్ని ఫోన్లలో కూడా లైవ్గా అందించబోతున్నారు. లాండ్లైన్, మొబైల్ ఫోన్ల ద్వారా దీన్ని వినచ్చు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో మిగిలిన నాయకుల కంటే ఒకడుగు ముందుండే నరేంద్రమోడీ.. మరికొన్ని గంటల్లో ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఎటూ దేశవ్యాప్తంగా దాదాపు అన్ని టీవీ ఛానళ్లలోనూ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అయితే, టీవీ అందుబాటులో లేని వాళ్లు, ప్రయాణాలలో ఉన్నవాళ్లకు ఈ కార్యక్రమాన్ని మిస్ అవుతున్నామన్న బాధ అక్కర్లేదు.

ఎందుకంటే, మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమం మొత్తాన్ని ఫోన్లలో కూడా లైవ్గా అందించబోతున్నారు. లాండ్లైన్, మొబైల్ ఫోన్ల ద్వారా దీన్ని వినచ్చు. ఈ విషయాన్ని వివాకనెక్ట్ అనే మొబైల్ మార్కెటింగ్ సంస్థ తెలిపింది. +91 22 4501 4501 నెంబరుకు కాల్ చేస్తే చాలు.. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఈ కార్యక్రమాన్ని వినచ్చు. అయితే, సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే ఈ నెంబరుకు ఫోన్ చేయాలి. అలాగే, రాష్ట్రపతి భవన్ వెబ్సైట్ కూడా ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement