పారిశుధ్య మెరుగుకు కట్టుబడి ఉన్నాం: మోదీ | Narendra Modi says committed to improving sanitation facilities | Sakshi
Sakshi News home page

పారిశుధ్య మెరుగుకు కట్టుబడి ఉన్నాం: మోదీ

Nov 20 2017 3:38 AM | Updated on Aug 15 2018 6:34 PM

Narendra Modi says committed to improving sanitation facilities - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో పారిశుధ్య వసతులను మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణంలో పాలుపంచుకుంటున్న వారి సేవలను కొనియాడారు. ప్రపంచ టాయిలెట్‌ డే(నవంబర్‌ 19) సందర్భంగా ఆదివారం మోదీ ట్వీటర్‌లో స్పందిస్తూ...‘వరల్డ్‌ టాయిలెట్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా పారిశుధ్య వసతులను మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిద్దాం. టాయిలెట్లు నిర్మిస్తున్న వ్యక్తులు, సంస్థలకు అభినందనలు. వారి విలువైన సహకారం స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు తిరుగులేని శక్తినిస్తోంది’ అని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement