కేంద్ర పెద్దల పిలుపుపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆయున ఢిల్లీలో మూడు రోజులుంటారని, శుక్రవారం సాయంత్రం లేదా శనివారం తిరిగి హైదరాబాద్ వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి.
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పెద్దల పిలుపుపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆయున ఢిల్లీలో మూడు రోజులుంటారని, శుక్రవారం సాయంత్రం లేదా శనివారం తిరిగి హైదరాబాద్ వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర విభజన ప్రక్రియను మంత్రుల బృందం(జీవోఎం) ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో గవర్నర్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు ఆంటోనీ, సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, గులాం నబీ ఆజాద్ ప్రభృతులతో గవర్నర్ కీలక చర్చలు జరుపుతారని భావిస్తున్నారు.
రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, సీమాంధ్రలో ఆందోళనల తీరు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి తదితర అంశాలపై ఆయన కేంద్ర నేతలకు నివేదికలిస్తారని సమాచారం. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని స్వదేశం చేరిన అనంతరం ఆయునతో గవర్నర్ భేటీ అవుతారు. ఇక బుధ, గురువారాల్లో కేంద్ర మంత్రులను కలవనున్నారు. ‘విభజన’ నేపథ్యంలో వివాదాస్పదమైన ప్రధాన అంశాలు, వివిధ పరిష్కారాలపై గవర్నర్ అభిప్రాయాలను ఢిల్లీ పెద్దలు తెలుసుకుంటారని, ఆ సమాచారం ఆధారంగానే విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.