ఆవును రక్షించిన ముస్లింలు | Muslims save cow from pit | Sakshi
Sakshi News home page

ఆవును రక్షించిన ముస్లింలు

Jul 12 2017 6:02 PM | Updated on Oct 16 2018 6:01 PM

ఆవును రక్షించిన ముస్లింలు - Sakshi

ఆవును రక్షించిన ముస్లింలు

గో మాంసం కోసం ఆవులను కబేళాలకు తరలిస్తున్నారనే అనుమానాలపై అమాయకులను కొట్టి చంపుతున్న నేటి సమాజంలో ఆపదలో చిక్కుకున్న ఓ ఆవును ముస్లింలు రక్షించడం చర్చనీయాంశమైంది.

లక్నో: గో మాంసం కోసం ఆవులను కబేళాలకు తరలిస్తున్నారనే అనుమానాలపై అమాయకులను కొట్టి చంపుతున్న నేటి సమాజంలో ఆపదలో చిక్కుకున్న ఓ ఆవును ముస్లింలు రక్షించడం చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ జిల్లా, బిలారి గ్రామంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

బిలారి గ్రామంలోని ఓ స్మశానంలోకి రెండు రోజుల క్రితం ప్రవేశించిన ఓ ఆవు ప్రమాదవశాత్తు అందులో ఉన్న ఓ గుంతలో పడిపోయింది. బయటకు వచ్చే దారిలేక బాధపడుతుంటే గమనించిన ముస్లిం యువకులు తమ పెద్దలకు చెప్పారు. వారు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. తాళ్లు తీసుకొచ్చి ఆవుకు కట్టారు. అప్పటికే దాని నోరు ఎండిపోవడంతో నీళ్లు తెచ్చి తాపించారు. అనంతరం దాన్ని వెలుపలికి తీశారు. గ్రామస్థులు వారి మానవత్వానికి ప్రశంసించారు.

Advertisement
 
Advertisement
Advertisement