శివ భక్తులకు ముస్లింల సేవలు

Muslim services To Shiva devotees - Sakshi

సర్వమానవ సమానత్వం మహనీయుల అభిమతం

శివదర్శన యాత్రలో  బోల్‌భమ్‌ భక్తులు

కాలినడకన వెళ్లే భక్తులకు సేవలందిస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలు

జయపురం ఒరిస్సా : సర్వమానవ సమానత్వం మహనీయుల అభిమతమని అది తెలియక కొంతమంది మత పిచ్చిలో మునుగుతున్నారని పలువురు బోల్‌భమ్‌ భక్తులు వ్యాఖ్యానించారు. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నప్పటికీ వారంతా ఆశించేది కేవలం సర్వమానవ సమానత్వమని అన్నారు. మతం కన్నా మానవత్వమే గొప్పదన్న ఆనాటి మహానీయుల బోధనలను అందరూ గుర్తుంచుకోవాలన్నారు.

కొందరు నేడు అజ్ఞానంతో మతం పేరిట దాడులు జరుపుకుంటున్నారని, అలా చేయడం తగదన్నారు. ఎలాంటి మత బేధాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. సమాజంలో అతి కొద్దిమంది స్వార్థపరుల వల్లే ఆనాటి మత ప్రవక్తల గొప్ప భావాలు తప్పుదారి పడుతున్నాయని ఆరోపించారు. 

బోల్‌భమ్‌ భక్తులకు చేయూత

ప్రతి శ్రావణమాసంలో శివుని దర్శనం కోసం వెళ్లే వేలాది మంది బోల్‌భమ్‌ భక్తులు కాలి నడకన ఆయా శివ క్షేత్రాలకు వెళ్తుండడం విశేషం. ఈ సందర్భంగా కొరాపుట్‌ జిల్లాలో కొలువైన గుప్తేశ్వరుని దర్శించుకునేందుకు వచ్చిన పలువురి బోల్‌భమ్‌ భక్తులకు కొరాపుట్‌ జిల్లాలోని కొంతమంది ముస్లిం సోదరులు ఆహార పదార్థాలు, నీరు, వైద్య సదుపాయం కల్పించి ఆదుకుంటున్నారు. ఇదే తరహాలో పలు స్వచ్ఛంద సంస్థలు కూడా కాలినడకన వెళ్లే అనేకమంది భక్తులకు చేయూతనిస్తుండడం గమనార్హం.

ఈ నేపథ్యంలో కాలినడకన వెళ్లే బోల్‌భమ్‌ భక్తుల కోసం అనేక చోట్ల సహా యం అందించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు కొంతమంది ఔత్సాహికులు కూడా టెంట్‌లు వేసుకుని మరీ సేవలందిస్తున్న విషయం తెలిసిందే. 

మతాలకతీతంగా సేవలు

మతాలకు అతీతంగా కొంతమంది సేవలందిస్తుండడాన్ని చూసి పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ స ందర్భంగా పలువురు మాట్లాడుతూ మత బేధాలు ముఖ్యం కాదని మానవత్వమే ముఖ్యమని చాటే కార్యక్రమాలకు ముస్లిం సోదరులు శ్రీకారం చుట్టడం శుభపరిణామన్నారు. ఇదే విధంగా అన్ని మతాలు వారు ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా మిత్రభావంతో మెలగాలని ఆకాంక్షించారు. ఏ వైపు నుంచి చూసినా భారతీయులమనే భావం తప్ప మరే ఇతర భావాలు ప్రదర్శించకూడదన్నా రు. అందరూ ఏ మత ప్రమేయం లేకుండా సేవా దృక్పథంతోసమాజానికి సేవలు చేయాలని పిలుపునిచ్చారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top