వారి వల్లే మనం ఈ స్థితిలో ఉన్నాం: ధోని | MS Dhoni has praised the armed forces | Sakshi
Sakshi News home page

వారి వల్లే మనం ఈ స్థితిలో ఉన్నాం: ధోని

Feb 21 2016 3:29 PM | Updated on Sep 3 2017 6:07 PM

వారి వల్లే మనం ఈ స్థితిలో ఉన్నాం: ధోని

వారి వల్లే మనం ఈ స్థితిలో ఉన్నాం: ధోని

దేశంలో భావప్రకటన స్వేచ్ఛపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని స్పందించాడు.

ఢిల్లీ: దేశంలో భావప్రకటన స్వేచ్ఛపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని స్పందించాడు. భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ.. జేఎస్యూలో జాతీయవాద వ్యతిరేక నినాదాల వివాదం నేపథ్యంలో సైన్యం సేవలను గుర్తు చేయడం గమనార్హం.

సాయుధ బలగాల మూలంగానే మనం భావప్రకటన స్వేచ్చపై చర్చించుకునే స్థితిలో ఉన్నామని ధోని ట్విట్టర్ ద్వారా సైన్యం సేవలను గుర్తు చేశాడు. స్వప్రయోజనాల కంటే ముందుగా దేశం కోసం పాటుపడేలా ప్రేరణ, శిక్షణ పొందిన ప్రత్యేక బలగాలు, కమెండో యూనిట్లలో పనిచేసే సైనికులు కూడా మన లాగా సాధారణ పౌరులేనని ధోని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement