అంబేడ్కర్‌కు ఎంపీల ఘన నివాళి | MPs Tribute to Ambedkar | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌కు ఎంపీల ఘన నివాళి

Dec 7 2016 2:36 AM | Updated on Aug 17 2018 8:11 PM

అంబేడ్కర్‌కు ఎంపీల ఘన నివాళి - Sakshi

అంబేడ్కర్‌కు ఎంపీల ఘన నివాళి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంటు లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పలు పార్టీల ఎంపీలు ఘన నివాళులు అర్పించారు.

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంటు లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పలు పార్టీల ఎంపీలు ఘన నివాళులు అర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత జితేందర్ రెడ్డి, ఎంపీలు కల్వకుంట్ల కవిత, బి.బి.పాటిల్, నగేశ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

టీడీపీ లోక్‌సభాపక్ష నేత తోట నర్సింహం, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, మాగంటి వెంకటేశ్వరరావు, మురళీమోహన్, గల్లా జయదేవ్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement