గర్భిణీ స్త్రీలకు సంజీవనిలా తోడై.. | Motorcycle-ambulances help saves lives in Chhattisgarh forests | Sakshi
Sakshi News home page

గర్భిణీ స్త్రీలకు సంజీవనిలా తోడై..

Jul 24 2016 5:22 PM | Updated on Sep 4 2017 6:04 AM

గర్భిణీ స్త్రీలకు సంజీవనిలా తోడై..

గర్భిణీ స్త్రీలకు సంజీవనిలా తోడై..

ఎజెన్సీ ప్రాంతాల్లో ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రాణాలు గాల్లో దీపాలు అయ్యేవి. అప్పటికప్పుడు వారిని మోసుకెళితే అదృష్టం కొద్ది ప్రాణాలు దక్కితే దక్కేవి లేకుంటే అంతే సంగతులు.

నారాయణ్పూర్: ఎజెన్సీ ప్రాంతాల్లో ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రాణాలు గాల్లో దీపాలు అయ్యేవి. అప్పటికప్పుడు వారిని మోసుకెళితే అదృష్టం కొద్ది ప్రాణాలు దక్కితే దక్కేవి లేకుంటే అంతే సంగతులు. ఇక గర్భిణీ స్త్రీల పరిస్ధితి అయితే మరీ దారుణం. ఎందుకంటే ఎక్కడో అడవి లోపల కొండలమధ్యలో నివసించే చత్తీస్గఢ్ ఎజెన్సీ ప్రాంత ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. రోడ్డు సౌకర్యం ఉండదు. ఉన్నా కాలిబాటకంటే కొంచె వెడల్పుగా వాహనం వెళ్లలేనంత ఇరుకుగా ఉంటుంది.

దీంతో అక్కడ ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే అంతే సంగతులు ఉండేది. కానీ, ఇప్పుడు ఆపరిస్థితి మారింది. చాలా చోట్ల అక్కడ ఇప్పుడు బైక్ అంబులెన్స్ లు దర్శనం ఇస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఇవి మరీ కీలకంగా మారాయి. ఇప్పటి వరకు దాదాపు 200 మంది గర్భిణీ స్త్రీల ప్రాణాలను అవి నిలబెట్టాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి అంబులెన్స్ లు ఆఫ్రికాలో విజయవంతం కావడంతో వాటిని తిరిగి యునెస్కో సలహాతో చత్తీస్ గఢ్ ప్రాంతంలో ప్రవేశపెట్టగా అవి చాలా చక్కటి సేవలు అందిస్తూ సంజీవనిలా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement