2020లో 5జీ టెక్నాలజీ తెస్తాం: కేంద్రం

Most firms plan to deploy 5G by 2020 - Sakshi

జలంధర్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: 2020 నాటికి దేశంలో 5జీ మొబైల్‌ టెక్నాలజీని తీసుకొస్తామని ఐటీ మంత్రి రవిశంకర్‌  తెలిపారు. దేశంలోని గ్రామ పంచాయతీలను ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌తో అనుసంధానించే ప్రాజెక్టు ఈ ఏడాదిలో పూర్తవుతుందన్నారు. ప్రస్తుతం గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవలు అందించే సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్ల ద్వారా దేశవ్యాప్తంగా 12 లక్షల మందికి ఉపాధిని అందిస్తున్నామని పేర్కొన్నారు.

55 అడుగుల రోబో: సైన్స్‌ కాంగ్రెస్‌లో శనివారం కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆవిష్కరించిన భారీ రోబో ప్రతిమ ఇది. 55 అడుగుల ఎత్తున్న ఈ రోబో పేరు మెటల్‌ మాగ్నా. 25 టన్నుల బరువున్న దీన్ని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ విద్యార్థులు రెండు నెలలు శ్రమించి తయారు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top