‘మోదీ వేరే దేశ ప్రధాని.. మౌనం సిగ్గుచేటు’

Modi Is Other Country PM Says DMK Working President Stalin - Sakshi

తూత్తుకుడి : తమిళనాడులోని తూత్తుకుడిలో జరిగిన ఘటనలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించకపోవడంపై డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంకే స్టాలిన్‌ మండిపడ్డారు. ప్రధాని మౌనం సిగ్గుచేటని అన్నారు. మోదీ భారతదేశ ప్రధాన మంత్రా.. లేక వేరే దేశానికి ప్రధాన మంత్రా అని​ ప్రశ్నించారు. సోమవారం పార్టీ కార్యకర్తలతో ఆందోళన నిర్వహించిన స్టాలిన్‌ మీడియాతో మాట్లాడుతూ..  తమిళనాడు కూడా ఇండియాలో భాగమే అని, దేశ ప్రధానిగా ఆయనకు కనీసం స్పందించే బాధ్యత కూడా లేదా అని​ అన్నారు.

తూత్తుకుడిలో జరిగిన ఘటనల్లో 13 మంది పోలీసు తూటాలకు బలైనా ప్రధాని కనీసం నోరు మెదపకపోవడం ఏంటని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే తూత్తుకుడిని సందర్శించాలని లేక కేంద్ర మంత్రి నన్న పంపి పరిస్థితులను చక్కదిద్దాలని డిమాండ్‌ చేశారు. తూత్తుకుడి ఘటనపై అత్యవసర క్యాబినెట్‌ సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా డీఎంకే గతంలో తమిళనాడు ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. కాగా తూత్తుకుడిలోని కాపర్‌ యూనిట్‌ను మూసివేయాలని అక్కడి ప్రజలు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top