మోడీ.. క్లీన్ క్లీన్! | Modi .. Clean, Clean! | Sakshi
Sakshi News home page

మోడీ.. క్లీన్ క్లీన్!

Jun 9 2014 1:34 AM | Updated on Aug 20 2018 9:16 PM

మోడీ.. క్లీన్ క్లీన్! - Sakshi

మోడీ.. క్లీన్ క్లీన్!

ప్రధానిగా నరేంద్ర మోడీ రాకతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రతను సంతరించుకోనున్నాయి.

న్యూఢిల్లీ: ప్రధానిగా నరేంద్ర మోడీ రాకతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రతను సంతరించుకోనున్నాయి. మోడీ ఆదేశాలతో ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఉన్న కేంద్ర హోంశాఖ, సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖల కార్యాలయాలను శుభ్రంగా మార్చే కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ రెండు కీలక శాఖల్లో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు దీన్ని చేపట్టారు.

ఇందులో భాగంగా చిందరవందరగా పడి ఉన్న వస్తువులను, అవసరం లేని ఫైళ్లను వదిలించుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని ఆదేశాల మేరకు... పని ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరుతూ కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్‌సేథ్ ఇటీవల చాలా ప్రభుత్వ విభాగాలకు లేఖ రాసినట్లు  ఓ అధికారి వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement