'ఆత్మలను తరిమికొడితే సెక్రటేరియట్‌కు వస్తాం' | Sakshi
Sakshi News home page

శ్మశానంలో సెక్రటేరియట్‌.. దెయ్యాలతో ఎమ్మెల్యేలు హడల్‌

Published Fri, Feb 23 2018 8:54 AM

MLAs Fear Spirits Haunting Rajasthan Secretariat - Sakshi

సాక్షి,  జైపూర్‌ : దెయ్యాలు, ఆత్మలు రాజస్థాన్‌ సెక్రటేరియట్‌లో హల్ చల్‌ చేస్తున్నాయట. ఇవి వదంతులు కాదు. ఈ మాటలు చెబుతున్నది స్వయంగా రాజస్థాన్‌ ప్రభుత్వ ఎమ్మెల్యేలే. ఇటీవల కాలంలో చనిపోయిన ఇద్దరు రాజస్థాన్‌ ఎమ్మెల్యేలు చనిపోవడంతో వారు చనిపోయి దెయ్యాలుగా మారి తిరుగుతున్నారంటూ వారే స్వయంగా చెబుతున్నారు. వెంటనే భూత వైద్యులు, వివిధ మతాల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించకపోతే తాము సెక్రటేరియట్‌లో అడుగు కూడా పెట్టబోమంటూ వారు కుండబద్ధలు కొట్టినట్లు చెబుతున్నారు.

తాను ముఖ్యమంత్రి వసుంధర రాజేకు సెక్రటేరియట్‌ భవనంలో ప్రత్యేక పూజలు జరిపించాలని, చుట్టుపక్కల ఏమీ రాకుండా చూడాలని ప్రత్యేకంగా చెప్పినట్లు బీజేపీ ఎమ్మెల్యే హబీబుర్‌ రహ్మాన్‌ తెలిపారు. ఒకప్పుడు శ్మశానంగా ఉన్న ప్రాంతంలో సెక్రటేరియట్‌ నిర్మించారని, దాంతో అందులో దెయ్యాలు తిరుగుతూ ఎమ్మెల్యేలను భయపెడుతున్నాయని ఆయన అన్నారు. 2001లో ఈ భవనం నిర్మించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement