ఎమ్మెల్యే తండ్రి.. ఎంతో నిరాడంబరుడు

MLA Father Simplicity Viral in Social Media - Sakshi

సాక్షి బెంగళూరు: ఎమ్మెల్యే తండ్రి అనగానే ఎలా ఉంటారు..? చుట్టూ మందీమార్బలం, నిరంతరం ఫోన్లలో సంప్రదింపులు, వెనుక ఓ నాలుగైదు కార్లు, జీపులు అనుకుంటారు. కానీ వీటన్నింటికీ ఆయన పూర్తి వ్యతిరేకం. దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి ఎమ్మెల్యే హరీశ్‌ పుంజా తండ్రి ముత్తన్న పుంజా ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఎమ్మెల్యే తండ్రి అయినప్పటికీ ఓ సైకిల్‌ మీద పాల క్యాన్‌ తీసుకుని రోడ్డు వెంట నడుచుకుంటూ వచ్చే ఫొటో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.  ఆయన నిరాడంబరత్వానికి మారు పేరు అని, ఎమ్మెల్యే తండ్రి అయినా ఆర్భాటాలకు వెళ్లని మంచి మనిషి ఎందరికో ఆదర్శమని ఫేస్‌బుక్‌లో కొనియాడుతున్నారు.  

30 ఏళ్ల నుంచీ అదే సైకిల్‌  
74 ఏళ్ల వయసులోనూ కష్టపడుతున్న వ్యక్తి అని ప్రశంసించారు. దీనిపై మీడియా ముత్తన్నను సంప్రదించగా తాను బాల్యం నుంచి ఇదే వృత్తిలో ఉన్నట్లు తెలిపారు. అయితే కుమారుడు ప్రజాప్రతినిధిగా గెలిచి అసెంబ్లీకి వెళ్లినా తన వృత్తి మరవలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే హరీష్‌ పుంజా స్పందిస్తూ తన తండ్రి సరళత్వానికి మారుపేరు అని కొనియాడారు. గత 30 ఏళ్ల క్రితం కొన్న సైకిల్‌నే ఇప్పటికీ వినియోగిస్తున్నారని తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top