8 రాష్ట్రాల్లో మైనారిటీలుగా హిందువులు! | Minority Status for Hindus in Eight States | Sakshi
Sakshi News home page

8 రాష్ట్రాల్లో మైనారిటీలుగా హిందువులు!

Nov 1 2017 11:35 AM | Updated on Sep 2 2018 5:24 PM

Minority Status for Hindus in Eight States - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో హిందువులను మైనారిటీలుగా గుర్తించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ఒక దాఖలైంది. ఆయా రాష్ట్రాల్లో నిత్యం హిందువులపై మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని అందులో న్యాయవాదులు పేర్కొన్నారు. మైనారిటీ చట్టం 1992ను అనుసరించి ఎనిమిది రాష్ట్రాల్లో హిందువులును మైనారిటీలుగా గుర్తించాలని కోరుతూ బీజేపీ నేత, సీనియర్‌ అడ్వకేట్‌ అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ సుప్రీంలో పిల్‌ దాఖలు చేశారు. దేశంలో ప్రస్తుతం మెజారిటీ, మైనారిటీ ప్రాతిపదిక మత రాజకీయాలు పెరిగిపోయాయని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌లకు ఆయన లేఖ రాశారు. అంతేకాక ప్రస్తుతం కొనసాగుతున్నర బలవంతవు లౌకిక వ్యవస్థ.. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని పేర్కొన్నారు.

లక్షద్వీప్‌, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయా, జమ్మూ కశ్మీర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, పంజాబ్‌లలో హిందువుల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో హిందువులను మైనారిటీలుగా గుర్తించాలని సుప్రీంకోర్టును అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ అభ్యర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement