‘మోదీ నటనకు అవార్డు ఇవ్వాల్సిందే!’

Memes on Man Vs Wild Episode - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘నేనప్పుడు చాలా పేదవాడిని. చాయ్‌ అమ్మాను. నాకస్సలు స్వార్థం లేదు. 18 ఏళ్లలో నేనిలా మాట్లాడం మొదటి సారి. నేను చాలా కష్టపడతాను’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాత్రి ‘డిస్కవరి’ ఛానల్‌ ప్రసారం చేసిన ‘మేన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియా తనదైన శైలిలో స్పందించింది. ‘నేనప్పుడు చాలా పేద వాడిని. చాయ్‌ అమ్మాను.... ఆ కార్యక్రమంలో సాహసికుడు బియర్‌ గ్రిల్స్‌తో మోదీ ఈ మాటలు చెప్పడం మొదటిసారి కావచ్చుగానీ ఇది మాకు అరిగిపోయిన రికార్డు. మన్‌ కీ బాత్‌లో చాలాసార్లు విన్నాం’ అంటూ కొందరు ట్వీట్‌ చేయగా, మోదీ హిందీలో మాట్లాడడంపై ఎక్కువ మంది ట్వీట్‌ చేశారు.

‘ఒక్క ముక్క కూడా హిందీ భాష రాని బియర్‌ గ్రిల్స్, మోదీ మాటలను ఎలా అర్థం చేసుకున్నారబ్బా!’ అంటూ ఎక్కువ మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హిందీ తప్పనిసరైన సీబీఎస్‌ఈలో టెన్త్‌క్లాస్‌ బియర్‌ గ్రిల్స్‌ తప్పక పాసై ఉంటాడని ఒకరు, మోదీ హిందీ మాటలను ఓపిగ్గా ఆలకించిన బియర్‌ గ్రిల్స్‌ పరిస్థితి ఇలా ఉందంటూ ఓ సినిమా క్లిప్‌ మరొకరు పోస్ట్‌ చేశారు. మాంచి కమెడియన్‌గా నటించినందుకు మోదీకి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వాలని మరొకరు ట్వీట్‌ చేశారు. మోదీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు చూసినందున టీఆర్‌పీ రేటు అనూహ్యంగా పెరిగి డిస్కవరీ ఛానల్‌ అధిపతికి అంతులేని డబ్బు వచ్చి ఉంటుందని కొందరు వ్యాఖ్యానించారు. దేశంలోని చాలా గ్రామాల్లో పాఠశాలల్లో, పంచాయతీ కార్యాలయాల్లో బీజేపీ నాయకులు టీవీలు పెట్టి మోదీ కార్యక్రమాన్ని ప్రజలకు చూపించారు. ఇది ‘మేన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ కాదని, మన్‌ కీ బాత్‌ అంటూ ఒకరిద్దరు వ్యాఖ్యానించగా ‘మోర్‌ మేన్‌ లెస్‌ వైల్డ్‌’... ‘మేన్‌ వర్సెస్‌ మేన్‌’ అంటు ఎక్కువ మంది స్పందించారు. (చదవండి: మోదీ వర్సెస్‌ వైల్డ్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top