కారు కావాలా..నీతో పెళ్లే వద్దుపో! | Marriage annulled | Sakshi
Sakshi News home page

కారు కావాలా..నీతో పెళ్లే వద్దుపో!

Feb 21 2016 1:41 PM | Updated on Aug 21 2018 5:51 PM

కారు కావాలా..నీతో పెళ్లే వద్దుపో! - Sakshi

కారు కావాలా..నీతో పెళ్లే వద్దుపో!

కట్నం కింద గొంతెమ్మ కోరిక కోరిన యువకుడితో ఓ యువతి ‘నీతో పెళ్లే వద్దుపో’ అని తెగేసి చెప్పింది.

కోట(రాజస్తాన్): కట్నం కింద గొంతెమ్మ కోరిక కోరిన యువకుడితో ఓ యువతి ‘నీతో పెళ్లే వద్దుపో’ అని తెగేసి చెప్పింది. ఫైతాపురా గ్రామానికి చెందిన భారతీ యాదవ్ అలియాస్ పింకీ(24)కి ఈ నెల 15న శంభుదయాళ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయునితో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం సందర్భంగా శంభుకు మోటార్ బైక్, కొన్ని నగలు చదివించుకున్నారు. ఈ నెల 22న పెళ్లి జరగాల్సి ఉంది.

అయితే కట్నం కింద కారును ఇవ్వాలని, లేకపోతే పెళ్లి రద్దు చేసుకుంటామని వరుడు, అతని మేనమామ బెదిరించారు. పెళ్లయిన ఆరునెలల్లోగా కారు ఇస్తామని హామీ ఇస్తూ పత్రాలపై సంతకం చేయమన్నారు. అయితే ఆ ఖరీదు కట్నాన్ని ఇవ్వలేమని పింకీ తండ్రి చెప్పాడు. ఆగ్రహించిన పింకీ పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement