వాహనాలు తగలబెట్టిన మావోయిస్టులు | Maoists torch 14 vehicles of NMDC | Sakshi
Sakshi News home page

వాహనాలు తగలబెట్టిన మావోయిస్టులు

Aug 18 2016 8:11 AM | Updated on Oct 9 2018 2:51 PM

ఛత్తీస్‌గఢ్లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు.

ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బచేలి సమీపంలో 20 వాహనాలను మావోయిస్టులు తగులబెట్టారు. బుధవారం రాత్రి మావోయిస్టులు జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) కి చెందిన వాహనాలకు నిప్పు పెట్టారు. అయితే బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఇదే ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని భద్రత బలగాలకు చెందిన ఉన్నతాధికారి ఒకరి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement