మావోయిస్టులు దాడి: బీఎస్ఎఫ్ జవాన్లకు గాయాలు | Maoists attack BSF convoy in Odisha, three jawans injured | Sakshi
Sakshi News home page

మావోయిస్టులు దాడి: బీఎస్ఎఫ్ జవాన్లకు గాయాలు

Mar 28 2014 12:23 PM | Updated on Aug 28 2018 7:14 PM

ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా బీఎస్ఎఫ్ జవాన్లపైన మావోయిస్టులు దాడి చేశారు.ఆ దాడిలో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు.

ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా బీఎస్ఎఫ్ జవాన్లపైన మావోయిస్టులు దాడి చేశారు.ఆ దాడిలో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల విధుల కోసం వెళ్తున్న బీఎస్ఎఫ్ జవాన్ల వాహనాన్ని మందుపాతరతో పేల్చివేశారు. ఎం.వి.126 గ్రామం వద్ద మావోయిస్టులు ఆ ఘాతుకానికి ఒడిగట్టారు.

 

మావోయిస్టుల దాడి సమాచారాన్ని జవాన్లు ఉన్నతాధికారులకు అందించారు. పోలీసు ఉన్నతాధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.మావోయిస్టుల కోసం పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement