మానస సరోవర్ యాత్ర ప్రారంభం | Manasa Sarovar tour started | Sakshi
Sakshi News home page

మానస సరోవర్ యాత్ర ప్రారంభం

Jun 12 2016 1:08 AM | Updated on Sep 4 2017 2:15 AM

ఈ ఏడాది కైలాస్ మానస సరోవర్ యాత్రను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం ఢిల్లీలో ప్రారంభించారు.

న్యూఢిల్లీ: ఈ ఏడాది కైలాస్ మానస సరోవర్ యాత్రను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం ఢిల్లీలో ప్రారంభించారు. మొదటి బృందం యాత్ర ప్రారంభం సందర్భంగా సుష్మా మాట్లాడుతూ... యాత్రికులు చైనాలో ప్రవేశించినప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. దాదాపు 1,430 మంది భక్తులు 25 బృందాలుగా చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న మానస సరోవర్‌ను సందర్శించుకుంటారు.

 వైష్ణోదేవి ఆలయం వద్ద హైఅలర్ట్
 జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయ బేస్ క్యాంప్ సమీపంలో ఓ వంతెన వద్ద పోలీసులు జరిపిన తనిఖీలో ఆర్మీకి చెందిన రెండు యూనిఫాంలు, బూట్లు అనుమానస్పదంగా లభ్యమయ్యాయి. దీంతో అక్కడ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement