రాందేవ్‌ బాబా కరోనా డ్రగ్‌కు ‘మహా’ షాక్‌ | Maharashtra Minister Warns Ramdev On Coronil | Sakshi
Sakshi News home page

రాందేవ్‌ బాబాకు ‘మహా’ వార్నింగ్‌

Jun 25 2020 11:06 AM | Updated on Jun 25 2020 11:30 AM

Maharashtra Minister Warns Ramdev On Coronil - Sakshi

‘కొరోనిల్‌ విక్రయాలను అనుమతించం’

ముంబై : కరోనా మహమ్మారికి రాందేవ్‌ బాబా సంస్థ పతంజలి ఆయుర్వేద విడుదల చేసిన కొరోనిల్‌ డ్రగ్‌ను మహారాష్ట్రలో అనుమతించబోమని ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ స్పష్టం చేశారు. తమ రాష్ట్రంలో కృత్రిమ మందుల అమ్మకాలను అనుమతించమని రాందేవ్‌ బాబాను హెచ్చరించారు. కొరోనిల్‌ ఔషధం పనితీరును అథ్యయనం చేసేందుకు పూర్తిస్ధాయిలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారా అనేది నిమ్స్‌, జైపూర్‌ నిగ్గుతేల్చాలని అనిల్‌ దేశ్‌ముఖ్‌ గురువారం ట్వీట్‌ చేశారు. కొరోనిల్‌ ప్రకటనలను ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నిషేధించడాన్ని మంత్రి స్వాగతించారు. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించకుండా, శాంపిల్‌ పరిమాణం వివరాలు, నమోదు వివరాలు లేకుండా కరోనాకు మందు కనుగొన్నామని పేర్కొనడం ఆమోదయోగ్యం కాదని, ప్రజారోగ్యం విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని మంత్రి దేశ్‌ముఖ్‌ పేర్కొన్నారు. (చదవండి : కోవిడ్‌కి పతంజలి ఔషధం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement