రాంగోపాల్ వర్మకు నోటీసులు | Ludhiana police in a spot as Ram Gopal Varma faces FIR under Section 66A | Sakshi
Sakshi News home page

రాంగోపాల్ వర్మకు నోటీసులు

Mar 26 2015 12:05 PM | Updated on Sep 2 2017 11:26 PM

రాంగోపాల్ వర్మకు నోటీసులు

రాంగోపాల్ వర్మకు నోటీసులు

శక, నిర్మాత రాంగోపాల్ వర్మపై ఉత్తరప్రదేశ్లోని లుధియానాలో కేసు నమోదు అయ్యింది.

హైదరాబాద్ : దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మపై ఉత్తరప్రదేశ్లోని లుధియానాలో కేసు నమోదు అయ్యింది. ఫిబ్రవరి 13న  'మెసెంజర్ ఆఫ్ గాడ్' సినిమాపై వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విమర్శలు చేసిన విషయం తెలిసిందే.  వర్మ వివాదాస్పద ట్విట్లపై డేరా అనుచరుడు  లుధియానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు బుధవారం వర్మపై సెక్షన్ 66A  కింద కేసు నమోదు చేశారు.  ఇప్పటికే ఇద్దరు పోలీసులు... వర్మకు నోటీసులు అందించేందుకు ముంబయి చేరుకున్నారు.

డేరా సచ్చా సౌద అధినేత గుర్మిత్‌రామ్‌ రహీం సింగ్‌ అలియాస్ డేరా బాబాను వర్మ 'గాడిద'గా అభివర్ణించిన విషయం తెలిసిందే. అలాగే క్లాస్ బ్రీడ్ అంటూ వివాదాస్పద పదజాలం వాడుతూ ట్వీట్ చేశారు. మరోవైపు సెక్షన్ 66Aను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మపై లుధియానా పోలీసులు పెట్టిన కేసు ఎంతవరకూ నిలుస్తుందో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement