రూ. 2.94 పెరిగిన సబ్సిడీ ఎల్పీజీ ధర | LPG price hiked by Rs 2.94 per cylinder | Sakshi
Sakshi News home page

రూ. 2.94 పెరిగిన సబ్సిడీ ఎల్పీజీ ధర

Nov 1 2018 4:07 AM | Updated on Jul 6 2019 3:18 PM

LPG price hiked by Rs 2.94 per cylinder - Sakshi

న్యూఢిల్లీ: సబ్సిడీ వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2.94 పెరిగింది. దీంతో బుధవారం అర్ధరాత్రి నుంచి 14.2 కిలోల సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.505.34కు చేరుకుంది. సబ్సిడీయేతర ఎల్పీజీ ధర సిలిండర్‌కు రూ.60 పెరిగి రూ. 880కు చేరింది. జూన్‌ నుంచి సబ్సిడీ సిలిండర్‌ ధర పెరగడం ఇది వరుసగా ఆరో నెల కావడం గమనార్హం. మార్కెట్‌లో ఇంధన ధరల ఆధారంగా ఎల్పీజీపై జీఎస్టీని గణిస్తారు. ధరపై ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినా పన్నును మాత్రం మార్కెట్‌ రేట్‌ ప్రకారం చెల్లించాలి. దీని వల్లే తాజాగా ఎల్పీజీ ధర పెరిగిందని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement