భారత్‌ వృద్ధి అంచనాలు కట్‌  | IMF cuts India FY27 growth forecast to 6. 4 Percent | Sakshi
Sakshi News home page

భారత్‌ వృద్ధి అంచనాలు కట్‌ 

Jul 9 2026 12:33 AM | Updated on Jul 9 2026 12:35 AM

IMF cuts India FY27 growth forecast to 6. 4 Percent

6.4 శాతానికి కుదించిన ఐఎంఎఫ్‌ 

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్‌ వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) కుదించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అంచనా వేసిన 6.5 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించింది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీల్లో ఒకటిగా భారత్‌ కొనసాగుతోందని, ప్రైవేట్‌ వినియోగం.. సర్వీసులు ఇందుకు దన్నుగా ఉంటున్నాయని తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 

అయితే, సానుకూలాంశాలు ఉన్నప్పటికీ ఇంధన ధరలు అధిక స్థాయిలో ఉండటమనేది ప్రతికూలంగా పరిణమించవచ్చని తెలిపింది. 2027లో ఇంధన ధరల షాక్‌ ప్రభావం నెమ్మదించి ఎకానమీ పటిష్టం కాగలదని ఐఎంఎఫ్‌ తెలిపింది. మధ్యకాలికంగా వృద్ధి సుమారు 6.5% ఉండొచ్చని వివరించింది. తాజా నివేదిక ప్రకారం 2028 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.7 శాతానికి చేరనుంది. మరోవైపు అంతర్జాతీయంగా వృద్ధి 2026లో 3కి పరిమితం కావచ్చని ఐఎంఎఫ్‌ తెలిపింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement