గాల్లో వేలాడుతూ వెరైటీగా పెళ్లి | Love Is Literally In the Air: Kolhapur Couple Gets Married 90m Above Ground | Sakshi
Sakshi News home page

గాల్లో వేలాడుతూ వెరైటీగా పెళ్లి

Aug 1 2016 5:36 PM | Updated on Sep 4 2017 7:22 AM

గాల్లో వేలాడుతూ వెరైటీగా పెళ్లి

గాల్లో వేలాడుతూ వెరైటీగా పెళ్లి

పెద్దలు కుదిర్చిన వివాహాన్నే నలుగురు మెచ్చుకునేలా చేసుకోవాలని అనుకుంటారు. అదే ప్రేమ వివాహానికి పెద్దల అంగీకారం కూడా తోడైతే ఆ ప్రేమికుల ఆలోచనలకు హద్దుంటుందా..

ముంబయి: పెద్దలు కుదిర్చిన వివాహాన్నే నలుగురు మెచ్చుకునేలా చేసుకోవాలని అనుకుంటారు. అదే ప్రేమ వివాహానికి పెద్దల అంగీకారం కూడా తోడైతే ఆ ప్రేమికుల ఆలోచనలకు హద్దుంటుందా.. వారి పెళ్లి చేసుకునే విధానం గురించి కనే కలలకు లెక్కంటూ ఉంటుందా.. గాల్లో తేలే ఆనందంతో ఎగిరి గంతేయరూ. మహారాష్ట్రకు చెందిన ఓ ప్రేమ జంట గాల్లోకి ఎగిరి గంతేయడమే కాదు.. అదే గాల్లోనే ఉండి ఏకంగా దండలు మార్చేసుకున్నారు.

అది కూడా దాదాపు 90 మీటర్ల ఎత్తుల్లో గాల్లో వేలాడుతూ. మహారాష్ట్రలోని కోలాపూర్ కు చెందిన జెహదీర్, రేష్మా అనే ఇద్దరికి ట్రెక్కింగ్ అంటే ఎంతో పిచ్చి. అలా ట్రెక్కింగ్ కు వెళ్లే క్రమంలో వారిద్దరు ప్రేమలో పడ్డారు. అదే ప్రేమను గాల్లోకి తీసుకెళ్లారు. పెద్దలను పెళ్లికి ఒప్పించి ఓ రోప్ వే ద్వారా 90 మీటర్ల ఎత్తులో వేలడుతూ దండలు మార్చుకున్నారు. తన ప్రియురాలి కోరిక మేరకు అతడు ఇలా ప్లాన్ చేశాడంట.

Advertisement
 
Advertisement
Advertisement