ఉగ్రవాదులు అమిత్షాను టార్గెట్ చేశారా..! | Live bombs found in Patna were to be used during Amit Shah's rally: Sources | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదులు అమిత్షాను టార్గెట్ చేశారా..!

Apr 1 2015 10:13 AM | Updated on Mar 29 2019 9:31 PM

ఉగ్రవాదులు అమిత్షాను టార్గెట్ చేశారా..! - Sakshi

ఉగ్రవాదులు అమిత్షాను టార్గెట్ చేశారా..!

పాట్నా: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాపై బాంబు దాడులు చేయాలని ఉగ్రవాదులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది.

పాట్నా: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాపై బాంబు దాడులు చేయాలని ఉగ్రవాదులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. పాట్నాలో పోలీసులు రెండు లైవ్ బాంబులను గుర్తించారు. గత ఏడాది ఏప్రిల్ 14న అక్కడ అమిత్ షా ర్యాలీని నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే సరిగ్గా అదే రోజు, ఆ సమయానికే పేల్చేలా వాటిని అమర్చారని నిఘా అధికార వర్గాల సమాచారం. అయితే, అవి ఆ రోజు పేలలేదు.

ఇటీవల ముగ్గురు తీవ్రవాదులను అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారించగా పాట్నాలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడాలని ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. అందుకోసం బాంబులు కూడా అమర్చామని చెప్పడంతో వారి సమాచారం మేరకు గాలింపులు చేపట్టగా తాజా బాంబులు బయటపడ్డాయి. 2013 గాంధీ మైదాన్లో ప్రధాని నరేంద్రమోదీ సమావేశం సందర్భంగా ఎలాంటి బాంబులను పేల్చాలని తీవ్రవాదులు నిర్ణయించుకున్నారో తిరిగి అలాంటి పేలుడు పదార్థాలే తాజాగా గుర్తించిన బాంబుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement