భార్య హత్య.. భర్తకు జీవిత ఖైదు | Life sentence for wifes murder | Sakshi
Sakshi News home page

భార్య హత్య.. భర్తకు జీవిత ఖైదు

Dec 2 2015 11:16 AM | Updated on Oct 4 2018 8:38 PM

భార్యను హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్తకు ఎరోడ్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది.

చెన్నై: భార్యను హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్తకు ఎరోడ్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాలిలా ఉన్నాయి.. రంగానాథన్(50) ఓ పండ్ల వ్యాపారి. అయితే, భార్యపై అనుమానం పెంచుకున్న రంగనాథన్ తరచుగా ఆమెతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో గతేడాది జూన్ 25న భార్యతో గొడవకు దిగిన భర్త, నైలాన్ తాడును ఆమె మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు.

తన తల్లిని, తండ్రే హత్య చేశాడని కూతురు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.మంగళవారం నాడు ఎరోడ్ జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ ఎన్ తిరునవుక్కరసు ఎదుట హాజరు పరిచారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్.. భార్యను హత్య చేసిన రంగనాథన్కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించారు.

Advertisement
 
Advertisement
Advertisement