
కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా జడ్జి
పర్లాకిమిడి : స్థానిక నవజీవన్ అంధ, అనాథ బాలబాలికల కేంద్రంలో జిల్లా న్యాయసలహా అథారిటీ తరఫున శుక్రవారం చైతన్య శిబిరం ఏర్పాటు చేశా రు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గజపతి జిల్లా జడ్జి, న్యాయ సలహా అథారిటీ అధ్యక్షుడు దుర్గాశంకరమిశ్రా హాజరై బాలబాలికలకు పీసీ, పీఎన్‌డీటీ చట్టం 1994 గురించి తెలియజేశారు. సన్మానిత అతిథిగా జిల్లా శిశుసంక్షేమ ప్రొటెక్షన్ అధికారి అరుణ్ కుమార్ సాహు పాల్గొని బాలబా లికలకు విభిన్న చట్టాలపై అవగాహన కల్పించా రు.
ప్రాధికరణ కార్యదర్శి దీపా దాస్ అనాథబాలబాలికలకు ప్రభుత్వ సహాయం, పునరావాసం గురించి అవగాహన కల్పించారు. కోర్టు రిజిస్ట్రార్ సర్వేశ్వర్ దాస్, జిల్లా శిశుసురక్షా అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, సీడబ్ల్యూసీ చైర్మన్ వినోద్ జెన్నా, నవజీవన్ ట్రస్ట్ట్ ఇన్‌చార్జి ఎస్వీ రమణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీఎస్‌ఎన్‌రాజు, ఆర్.జనార్దన రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి నవజీవన్ ట్రస్ట్ విద్యార్థులకు రూ.ఇరవై వేల చెక్కును అందజేశారు. జిల్లా జడ్జి మిశ్రా ద్వారా నవజీవన్ ట్రస్ట్‌లో ఒక కంప్యూటర్ కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు.