లాలూ కుమార్తె ప్రచారానికి ఐఐటీ ప్రోఫెషనల్స్ సపోర్ట్! | Lalu Prasad Yadav 's daughter hires two IITians to manage her campaign | Sakshi
Sakshi News home page

లాలూ కుమార్తె ప్రచారానికి ఐఐటీ ప్రోఫెషనల్స్ సపోర్ట్!

Apr 4 2014 1:37 PM | Updated on Aug 14 2018 4:21 PM

లాలూ కుమార్తె ప్రచారానికి ఐఐటీ ప్రోఫెషనల్స్ సపోర్ట్! - Sakshi

లాలూ కుమార్తె ప్రచారానికి ఐఐటీ ప్రోఫెషనల్స్ సపోర్ట్!

ఓటర్లను ఆకట్టుకునేందుకు సాగించే ఎన్నికల్లో ప్రచారానికి పలు రకాలైన పద్దతులను రాజకీయ నాయకులు చేపడుతారు.

పాట్నా: ఓటర్లను ఆకట్టుకునేందుకు సాగించే ఎన్నికల్లో ప్రచారానికి పలు రకాలైన పద్దతులను రాజకీయ నాయకులు చేపడుతారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తే మిసా భారతి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తన ఎన్నికల ప్రచారానికి ఐఐటీ నిపుణులు, వైద్యులను మీసా భారతీ ఉపయోగించుకుంటున్నారు. ఈ ప్రచారానికి మీసా భారదీ భర్త శైలేష్ కుమార్ అండదండలు అందిస్తున్నారు.
 
డాక్టర్ గా సేవలందిస్తున్న మీసా పాటలీ పుత్ర నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. తన ప్రచార మేనేజ్ మెంట్ కు ఇద్దరు ఐఐటీ ప్రొఫెషనల్స్ పంకజ్ సూడన్, పెర్ వీన్ త్యాగిలను నియమించారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ వర్గాలను కలిసేందుకు, వారితో వ్యవహరించేందుకు తగిన సలహాలను, సూచనలను అందిస్తున్నారు.
 
సూడన్ గుర్గావ్ లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తుండగా, త్యాగి స్వంతంగా ఓ ఐటీ కంపెనీని నిర్వహిస్తున్నారు. వారు రూపొందించిన ఫేస్ బుక్ పేజ్ కు పాట్నా ప్రజల నుంచి ఆమోఘ స్పందన రావడంతో మీసా ఆనందంతో తబ్బిబ్బువుతున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement