రాహుల్‌, సోనియాలతో కుమారస్వామి భేటీ | kumaraswamy Says Rahul And Sonia Gandhi Will Attend His Swearing-in Ceremony | Sakshi
Sakshi News home page

రాహుల్‌, సోనియాలతో కుమారస్వామి భేటీ

May 21 2018 7:59 PM | Updated on May 21 2018 10:00 PM

kumaraswamy Says Rahul And Sonia Gandhi Will Attend His Swearing-in Ceremony - Sakshi

కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌ గాంధీలతో జేడీఎస్‌ చీఫ్‌ కుమారస్వామి భేటీ

సాక్షి, న్యూఢిల్లీ : జేడీఎస్‌ చీఫ్‌ కుమారస్వామి సోమవారం సాయంత్రం కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలతో భేటీ అయ్యారు. సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశం సందర్భంగా ఈనెల 23న జరిగే తన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కుమారస్వామి వారిని ఆహ్వానించారు. కర్ణాటక సీఎంగా పాలనా పగ్గాలు చేపడుతున్న క్రమంలో కుమారస్వామి కూటమి భాగస్వామ్య పార్టీ నేతలతో పలు అంశాలు ప్రస్తావించారు. కేబినెట్‌ కూర్పు, శాఖల కేటాయింపుపైనా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.

ఢిల్లీ చేరుకున్న వెంటనే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ తొలుత బీఎస్‌పీ అధినేత్రి మాయావతి నివాసానికి స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఫోన్‌ చేసి బెంగళూర్‌లో జరిగే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. కాగా, ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలు హాజరవుతారని కుమారస్వామి చెప్పారు.

1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement