హరితవన అభివృద్ధిలో ఖాకీలు! | Sakshi
Sakshi News home page

హరితవన అభివృద్ధిలో ఖాకీలు!

Published Sat, Jul 2 2016 6:20 PM

హరితవన అభివృద్ధిలో ఖాకీలు! - Sakshi

ముంబై ప్రజలు ట్రీ ప్లాంటేషన్ డే ను ఘనంగా జరుపుకున్నారు. మహరాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మొక్క్లలు నాటే కార్యక్రమంలో ముంబై పోలీసులు సైతం భాగస్వాములయ్యారు.  నగరంలో హరిత వనాన్ని అభివృద్ధి చేసి, కాలుష్యాన్ని కాలరాసే ప్రయత్నం చేశారు.

మహరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో ముంబై పోలీసులు పాలుపంచుకున్నారు. జూలై 1న  రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2 కోట్ల మొక్కలను నాటాలన్న తలంపుతో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో తమవంతు ప్రయత్నంగా నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటారు. మొక్కలు నాటే  కార్యక్రమంలో పోలీసులతోపాటు, స్థానిక రాజకీయ నాయకులు, ఎన్జీవో సంస్థలు, ప్రజలు సైతం భాగం పంచుకున్నట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు.

హరిత వనాన్ని అభివృద్ధి చేసేందుకు పోలీసులు ట్విట్టర్ ను కూడ వాడుకున్నారు.  ఆయా ప్రాంతాల పోలీస్టేషన్లలో మొక్కలు నాటుతూ తీసుకున్నఫోటోలను ప్రచారంలో భాగంగా  ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement