వచ్చే ఐదేళ్ళలో వివిధ రంగాల్లో 25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేరళ గవర్నర్ పి. సదాశివం ఓ సందర్భంలో ప్రస్తావించారు.
కేరళః తమ రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా మార్చేందుకు కేరళ ప్రభుత్వం తీవ్రంగా కృష్టి చేస్తోంది. అందులో భాగంగా ఐటీ, బయోటెక్నాలజీ, టూరిజం తోపాటు వివిధ రంగాల్లో కొత్తగా 25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
వచ్చే ఐదేళ్ళలో వివిధ రంగాల్లో 25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేరళ గవర్నర్ పి. సదాశివం ఓ సందర్భంలో ప్రస్తావించారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం విధానాన్ని కూడ మార్చే ఉద్దేశ్యంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. కేరళ రాష్ట్ర కొత్త ప్రతిపాదనలో భాగంగా ఐటీ, బయోటెక్నాలజీ, టూరిజం రంగాల్లో మొత్తం 10 లక్షల ఉద్యోగాలు, వ్యవసాయ రంగంలో మిగతా 15 లక్షల ఉద్యోగాలు ఐదేళ్ళలోగా భర్తీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.