టీవీ చూస్తూ.. సిమ్‌కార్డు మింగేసింది! | kerala girl swallows sim card while watching tv | Sakshi
Sakshi News home page

టీవీ చూస్తూ.. సిమ్‌కార్డు మింగేసింది!

May 24 2016 7:14 PM | Updated on Aug 14 2018 4:46 PM

టీవీ చూస్తూ.. సిమ్‌కార్డు మింగేసింది! - Sakshi

టీవీ చూస్తూ.. సిమ్‌కార్డు మింగేసింది!

కేరళలో ఓ యువతి టీవీ చూస్తూ.. పొరపాటున సిమ్ కార్డు మింగేసింది.

టీవీలో ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి.. కేరళలో ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తోంది.. ఆ విషయం గురించి 16 ఏళ్ల అస్వతి అనే అమ్మాయి తన తల్లిదండ్రులతో చర్చిస్తోంది. ఫలితాల గురించిన చర్చ కాస్త వేడెక్కింది.. అంతలో ఆమె తన చేతిలో పట్టుకుని ఉన్న సిమ్‌కార్డును కాస్తా గుటుక్కున మింగేసింది!! దాంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకు పళ్లు, పీచు పదార్థాలు పెట్టారు. ఎలాగోలా సిమ్ కార్డు బయటకు వస్తుందన్న ఆలోచనతో అలా చేసినా, ఫలితం కనిపించలేదు.

కాసేపటి తర్వాత ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ సీటీ స్కాన్ చేశారు. అందులో.. ఆ సిమ్ కార్డు ఆమె ఊపిరి తిత్తుల్లో ఇరుక్కున్నట్లు కనిపించింది. దాంతో వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి సిమ్ కార్డు బయటకు తీశారు. సోమవారం నాడు అస్వతిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. వైద్యులు సీటీ స్కాన్ తీయకపోతే ఆమె ప్రాణాలు కూడా కోల్పోయేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement