ఆస్పత్రి నుంచి కరుణానిధి డిశ్చార్జ్ | Karunanidhi discharged from Kauvery hospital in Chennai | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి నుంచి కరుణానిధి డిశ్చార్జ్

Dec 7 2016 10:10 PM | Updated on Sep 4 2017 10:09 PM

ఆస్పత్రి నుంచి కరుణానిధి డిశ్చార్జ్

ఆస్పత్రి నుంచి కరుణానిధి డిశ్చార్జ్

గత వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది.

చెన్నై: గత వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది. చెన్నైలో తాను చికిత్స పొందిన కావేరీ హాస్పిటల్ నుంచి బుధవారం రాత్రి కరుణానిధి డిశ్చార్జ్ అయ్యారు. డీఎంకే చీఫ్ ఆరోగ్యం మెరుగైందని అందుకే ఆయనను డిశ్చార్జ్ కావాలని సూచించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చినట్లు వైద్యులు చెప్పారు.

మరోవైపు కరుణానిధి అనారోగ్యం కోలుకుని ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్తున్నారన్న విషయం తెలియగానే డీఎంకే నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. డిసెంబర్ 1వ తేదీన డీహైడ్రేషన్, అలర్జీ సంబంధిత అనారోగ్య కారణాలతో కరుణానిధి చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement